G20 సమ్మిట్.. ప్రియమైన దోస్త్మెలోనితో ప్రధాని మోదీ ముచ్చట్లు..వీడియో వైరల్

G20 సమ్మిట్.. ప్రియమైన దోస్త్మెలోనితో ప్రధాని మోదీ ముచ్చట్లు..వీడియో వైరల్

ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్నేహం గురించి మనందరికీ తెలిసిందే. అంతర్జాతీయ వేడుకల్లో ఎక్కడ కలిసినా  ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. వారిద్దరు కలిస్తే నవ్వులే నవ్వులు.  ప్రధాని మోదీకి గొప్ప అభిమాని అయిన మెలోనీ.. గతంలో చాలా సార్లు మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ ట్వీట్లు చేస్తూ ఉంటుంది.. అవి బాగా వైరల్ అయ్యాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన G20 సమావేశాలకు ఇద్దరు దేశాధినేతలు  హాజరయ్యారు. ప్రియమైన దోస్త్​ మెలోనీతో ప్రధాని మోదీ  ముచ్చిటిస్తున్న వీడియోలో సోషల్​ మీడియాలో బాగా వైలర్​ అవుతున్నాయి. 

G20 సమావేశాల్లో  ప్రధాని మోదీ ఎదురు పడగానే మెలోనీ చిరునవ్వుతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. జూలైలో కెనాడాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో కలుసుకున్న మోదీ, మెలోనీ తాజాగా G20 సమావేశంలో ఎదరుపడ్డారు.  అంతకుముందు మెలోని ఆత్మకథ ఇండియన్ ఎడిషన్‌కు ముందుమాట వ్రాశారు ప్రధాని మోదీ.. మెలోనీ నారీ శక్తికి  నిదర్శనం..ఇది కేవలం ఆత్మకథ కాదు.. ఆమె మన్ కీ బాత్. అంటూ ప్రశంసలు కురిపించారు. 

►ALSO READ | ప్రధాని మోడీకి V6 బోనాల సాంగ్‌తో స్వాగతం : ఏ దేశమేగినా తెలంగాణ సంస్కృతిలో V6 News భాగం

శనివారం జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జరిగిన G20 సమ్మిట్​ కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని మోదీ, చైనా ప్రధాని లీ కియాంగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, టర్కిష్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సహా అనేక మంది ప్రపంచ నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి అమెరికా డుమ్మా కొట్టింది.